Gold Rates | పసిడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. తులం బంగారం రూ.70వేల మార్క్‌ను దాటడంతో పెళ్లిళ్ల సీజన్‌లో జనం ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.1000 వరకు పెరిగింది. తాజాగా మంగళవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 తగ్గి తులానికి రూ.63,350కి దిగజారింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.270 తగ్గడంతో తులం రూ.69,110కి పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.64,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,150కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.63,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,110కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,260కి పతనమైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.63,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.69,110 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి స్థిరంగా కొనసాగుతున్నది. వెండి ధర భారీగానే పెరిగింది. కిలోకు రూ.400 పెరగడంతో కిలోకు రూ.79వేలకు ఎగిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82వేలకు చేరుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.
Gold Rates | పెరిగేది కొండంత.. తగ్గేది పిసరంత..! స్వల్పంగా పతనమైన బంగారం
Gold Rates | పసిడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. తులం బంగారం రూ.70వేల మార్క్‌ను దాటడంతో పెళ్లిళ్ల సీజన్‌లో జనం ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.1000 వరకు పెరిగింది. తాజాగా మంగళవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 తగ్గి తులానికి రూ.63,350కి దిగజారింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.270 తగ్గడంతో తులం రూ.69,110కి పతనమైంది. […]

Latest News
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో