Gold Rates | బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. వరుగా రెండోరోజూ గురువారం బులియన్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. వరుస ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 పెరిగి.. తులానికి రూ.71,100 పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 పెరిగి తులానికి రూ.77,560కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,560కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.71,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,710 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,560కి చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,560 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో రూ.95వేలు ఉనది. హైదరాబాద్‌లో కిలోకు రూ.1,01,000గా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.