Site icon vidhaatha

SUV Cars | భారత మార్కెట్‌లో ఎస్‌యూవీలకు భారీ డిమాండ్‌..! కొత్త మోడల్స్‌ను లైన్‌లో పెట్టిన కంపెనీలు..!

SUV Cars | భారత మార్కెట్‌లో యూఎస్‌వీలకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలన్నీ కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతి, కియా మోటార్స్, హోండా, మహీంద్రా తదితర కంపెనీలన్నీ త్వరలో ఆరు సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు లాంచ్‌ చేయబోతున్నాయి.

స్కోడా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ..

స్కోడా త్వరలోనే కాంపాక్ట్‌ ఎస్‌యూవీలను లాంచ్‌ చేయబోతున్నాయి. స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది మార్చి నెలలో మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నది. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌ వర్షెన్‌ 202లో భారత్‌లో జరిగే మొబిలిటీ షోలో ఉండే ఛాన్స్‌ ఉంది. కియా సోనెట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, టాటా పంచ్‌ తదితర మోడల్స్‌కు పోటీగా సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేయనున్నది. స్లావియా సెడాన్‌, కుషాక్‌ మోడల్స్‌కు ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ తీసుకురాబోతున్నట్లు టాక్‌. అలాగే కొడియాక్‌ మోడల్‌ అప్‌డేట్‌ వర్షెన్‌ సైతం తీసుకురానున్నది.

హ్యుందాయ్‌ వెన్యూ

హుంద్యాయ్‌ కంపెనీ వెన్యూ సెకండ్‌ జనరేషన్‌ను వచ్చే ఏడాది తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం Q2Xi కోడ్ నేమ్‌తో ఈ ఎస్‌యూవీని పిలుస్తున్నారు. వచ్చే ఏడాది హ్యుండయ్ వెన్యూ డిజైన్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక భద్రతను సైతం మెరుగుపరిచే అవకాశాలున్నాయి. పాలిసేడ్ తరహా డిజైన్‌ ఉండవచ్చని.. ఇప్పటికే హ్యుందాయ్ ఇప్పటికే క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఈ డిజైన్‌ను ఉపయోగిస్తోంది. సెకండ్‌ జనరేషన్‌లో ఇదే డిజైన్‌ వినియోగించే అవకాశం ఉంది.

టాటా కంపెనీ నుంచి నెక్సాన్‌

టాటా కంపెనీ తీసుకువచ్చిన ఎస్‌యూవీలలో నెక్సాన్ ఒకటి. ఈ కారుకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. తాజాగా ఈ కారును సీఎన్ జీ వెర్షన్‌ తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం మార్కెట్‌ను షేక్‌ చేస్తున్నది. టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ ఎస్‌యూవీ కారు ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే వకాశం ఉంది. దేశంలోనే తొలి టర్బో చార్జ్‌డ్‌ కారు ఇది. డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్స్ టాటా నెక్సాన్ ఐసీఐ వెర్షన్‌ తరహాలో ఉండనున్నది.

కియా నుంచి క్లావిక్స్

కియా మోటార్స్ త్వరలో లాంచ్ చేయనున్న కొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకురాబోతున్నది. ఈ మోడల్‌ పేరును కియా సిరోస్ లేదంటే కియా క్లావిక్స్ పేరు పెట్టనున్నట్లు తెలుస్తున్నది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్‌కు పోటీగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తున్నది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో వెర్టికల్ పొజీషన్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్ ఉండనున్నది.

నిస్సాన్ నుంచి మాగ్నెట్..

భారత్‌లో నాలుగేళ్ల తర్వాత తరువాత నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్‌ కానున్నది. ఈ ఏడాది చివరిలో లేకపోతే వచ్చే ఏడాది తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నది. ప్రస్తుతం మాగ్నైట్ మోడల్‌కు మంచి ఆదరణ ఉన్నది. ఈ మోడల్‌కు ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ తీసుకురాబోతున్నది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో మార్పులతో తీసుకురాబోతున్నది.

Exit mobile version