Site icon vidhaatha

Mohan Lal | హీరో మోహన్ లాల్ సంచలనం..నగల యాడ్‌ వీడియో వైరల్!

విధాత : జ్యూవెలరీ, వస్త్ర దుకాణాల వ్యాపార ప్రకటనలు సహజంగా మహిళా మోడల్స్, ప్రముఖ హీరోయిన్స్ తో రూపొందించడం ఇప్పటిదాక జరుగుతూ వస్తుంది. అందుకు భిన్నంగా ఏం..ఎందుకు జ్యూవెలరీ యాడ్ ను మహిళలే చేయాలా..మేం ఎందుకు చేయకూడదంటూ ఓ కొత్త ప్రయోగానికి తెర లేపాడు ఓ ప్రముఖ సీనియర్ హీరో. ఏకంగా చేతికి గాజులు, మెడలో హారం వేసుకుని ఓ ప్రముఖ నగల సంస్థకు చెందిన బ్రాండ్ ప్రమోట్ చేశాడు ఆ హీరో. ఆయన ఎవరో కాదండోయ్..ప్రముఖ మళయాళ నటుడు..పాన్ ఇండియా స్టార్ మోహన్‌లాల్‌. తాజాగా ఓ జ్యూవెలరీ షాప్ యాడ్ లో నగలు ధరించి అమ్మాయిలా హావభావాలు పలికిస్తూ మోహన్‌లాల్‌ నటించిన యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు జ్యూవెలరీ యాడ్స్ హీరోయిన్లే చేయాలా.. హీరోలా చేయకూడదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. నగలు ఆడవాళ్లే కాదు..మగవారు కూడా ధరిస్తుంటారని..మరి యాడ్ లలో మగవారు ఎందుకు నటించకూడదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారంతా ఇలాంటి వినూత్న ప్రయోగం ఒక్క మోహన్‌లాల్‌ మాత్రమే ధైర్యంగా చేయగలరని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version