Site icon vidhaatha

RBI | ఐదు బ్యాంకులకు భారీగా జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంకు

RBI : దేశంలోని ఐదు బ్యాంకులకు ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ భారీగా జరిమానా విధించింది. ఐదు బ్యాంకులకు కలిపి వేసిన జరిమానా విలువ రూ.60.3 లక్షల కాగా.. అందులో రాజ్‌కోట్ నాగరిక్ సహకార బ్యాంకుకే అత్యధికంగా రూ.43.30 లక్షల జరిమానా వేసింది. RBI జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించకపోవడంతో కేంద్ర బ్యాంకు ఈ జరిమానాలు వేసింది.

డైరెక్టర్‌లు, వారి బంధువులకు రుణాలు, అడ్వాన్సులపై ఇవ్వడంపై ఆర్బీఐ నిషేధం విధించింది. కానీ బ్యాంకులు ఈ నిషేధాన్ని ఉల్లంఘించాయి. అదేవిధంగా కొన్ని బ్యాంకులకు పొదుపు ఖాతాలు తెరవడంపై ఆంక్షలు ఉన్నాయి. కానీ బ్యాంకులు ఆ ఆంక్షలను లెక్కచేయలేదు. కొన్ని బ్యాంకుల డిపాజిట్‌ ఖాతాల నిర్వహణలోనూ లోపాలు బయటపడ్డాయి.

పై కారణాలతో ఆర్బీఐ.. రాజ్‌కోట్ నాగరిక్ సహకార బ్యాంకుకు రూ.43.30 లక్షలు, న్యూఢిల్లీలోని కాంగ్రా కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ.5 లక్షలు, లక్నోలోని రాజధాని నగర్ సహకార బ్యాంకుకు రూ.5 లక్షలు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం కోట్‌ద్వార్‌ జిల్లా గర్వాల్‌లోని జిల్లా సహకార బ్యాంకుకు రూ.5 లక్షలు, డెహ్రాడూన్‌ జిల్లా సహకార బ్యాంకుకు రూ.2 లక్షలు జరిమానా విధించింది.

Exit mobile version