EPFO Claim Status | పీఎఫ్‌ మనీ క్లెయిమ్‌ చేశారా.. స్టేటస్‌ తెలుసుకునేందుకు మూడు మార్గాలు..!

EPFO Claim Status | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల సౌకర్యార్థం తన పోర్టల్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. ఈ పోర్టల్‌లో పీఎఫ్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. చందాదారు కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం డిపాజిట్ చేసిన వడ్డీ వివరాలను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో నామినీ పేరును యాడ్ చేయవచ్చు.

  • Publish Date - April 25, 2024 / 12:17 PM IST

EPFO Claim Status : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల సౌకర్యార్థం తన పోర్టల్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. ఈ పోర్టల్‌లో పీఎఫ్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. చందాదారు కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం డిపాజిట్ చేసిన వడ్డీ వివరాలను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో నామినీ పేరును యాడ్ చేయవచ్చు.

అదేవిధంగా మీ EPF ఖాతా నుంచి నగదు ఉపసంహరణ కోసం క్లెయిమ్‌ చేసుకుని ఉంటే ఆ క్లెయిమ్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్‌ ఖాతాలో క్లెయిమ్‌ స్టేటస్‌న మూడు విధాలుగా చెక్‌ చేసుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి UAN మెంబర్ పోర్టల్ ద్వారా, రెండు EPFO వెబ్‌సైట్‌ ద్వారా, మూడు ఉమంగ్ పోర్టల్ ద్వారా EPFO క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

UAN ద్వారా..

1. ముందుగా UAN మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ UAN (Universal Account Number), పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి లాగిన్ కావాలి
2. ఆ తర్వాత హోమ్ స్క్రీన్‌లో కనిపించే ఆన్‌లైన్‌ సర్వీసెస్ ట్యాట్‌పై క్లిక్ చేయాలి
3. ఆ లిస్టును డ్రాప్ డౌన్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి
4. ఇక్కడ ఆన్‌లైన్‌ విత్‌డ్రా క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు

EPFO వెబ్సైట్ ద్వారా..

1. https://passbook.epfindia.gov.in/MemClaimStatusUAN/ లింక్ ద్వారా EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
2. EPFO పాస్‌బుక్‌ & క్లెయిమ్ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి
3. UAN, EPFO మెంబర్ పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
4. క్లెయిమ్ ట్రాక్ మీద క్లిక్ చేయగానే మీ అన్ని క్లెయిమ్స్‌ స్థితి కనిపిస్తుంది. అందులో అప్రూవ్డ్, సెటిల్, ఈ-ప్రాసెస్ లాంటి అన్ని రకాల స్టేటస్‌లను చూడవచ్చు.

UMANG యాప్ ద్వారా..

1. ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేయాలి
2. అందులో EPFO ఆప్షన్‌లోకి వెళ్లి, ఆల్ సర్వీసెస్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి
3. ట్రాక్ క్లెయిమ్ ఆప్షన్‌లోకి వెళ్లి, ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ ట్యాబ్‌పై నొక్కాలి
4. ఇప్పుడు మీ UAN నమోదు చేసి OTPపై క్లిక్ చేయాలి
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై నొక్కాలి
6. అప్పుడు మీకు అన్ని రకాల క్లెయిమ్‌ల వివరాలు కనిపిస్తాయి.

Latest News