Site icon vidhaatha

Aadhar | అప్‌డేట్‌ చేయని ఆధార్‌ కార్డులు జూన్‌ 14 తర్వాత పని చేయవా..? కార్లిటీ ఇచ్చిన UIDAI..!

Aadhar | ఆధార్‌కార్డు తీసుకొని పదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేయని కార్డులు జూన్‌ 14 తర్వాత పని చేయవని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) ఖండించింది. ఆధార్‌ని అప్‌డేట్‌ చేసుకోని వారంతా జూన్‌ 14లోగా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అయితే, గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్‌డేట్‌ చేయని ఆధార్‌కార్డులు పని చేయకపోవడం అనేది ఏమాత్రం ఉండదని తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ వుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని ఉడాయ్‌ సూచించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌, లేకపోతే ఆధార్‌ కేంద్రాలను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్‌ని అప్‌డేట్‌ చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్‌ సెంటర్‌లో వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ని అప్‌డేట్‌ చేసుకోండి..?

Exit mobile version