విధాత: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్ సంతకమే ఫోర్జరీ చేశారు. తహసీల్దార్ అప్పలునాయుడు, రవీందర్ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీల్,మరో ఇద్దరు కలిసి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్ రవీందర్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు.