సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌పై HRC సుమోటో కేసు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వచ్చే నెల 28లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

ivf-center-fraud-hyderabad-dna-test-case

విధాత: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వచ్చే నెల 28లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

అసలు సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో ఏమైంది?

రాజస్థాన్‌కు చెందిన దంపతులు సరోగసి ద్వారా సంతానం కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రతను సంప్రదించారు. భర్త వీర్యకణాలతో సంతానం కావాలని రాజస్థాన్ మహిళ కోరింది. సరోగసి ద్వారా బిడ్డను అందించేందుకు 30లక్షలు ఖర్చు అవుతాయని నమ్రత చెప్పారు. వారిని నమ్రత బెజవాడలోని తమ సెంటర్ కు పంపించారు. అక్కడ డాక్టర్ కరుణ, సోనాలిల ఆధ్వర్యంలో వారికి పరీక్షలు నిర్వహించారు. భర్త వీర్యం శాంపిల్స్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సరోగసి(అద్దె గర్బం)కి మహిళ దొరికిందని చెప్పి విశాఖకు చెందిన ఓ మహిళను చూపించి దంపతుల నుంచి 30లక్షలు వసూలు చేశారు. కొన్నాళ్లకు మగబిడ్డను వారికి అప్పగించారు. సిజేరియన్ చేయాల్సి వచ్చిందని చెప్పి అదనంగా మరో 10లక్షలు వసూలు చేశారు.

అయితే బాబు పోలికలపైన.. తరుచు అనారోగ్యం పాలవుతుండటంపైన అనుమానంతో దంపతులు డాక్టర్ నమ్రతను డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరారు. అందుకు నమ్రత నిరాకరించి వారిని బెదిరించింది. తన భర్త న్యాయవాది అని చెప్పి…మీరు అక్రమంగా అనుమతులు లేకుండా సరోగసి సంతానం పొందారని..చట్టప్రకారంగా వెళితే మీపై కేసులు అవుతాయంటూ బెదిరించారు. దీంతో బాధిత దంపతులు ఢిల్లీలోని ఓ ల్యాబ్ లో డీఎన్ఏ టెస్టు చేయించగా..బాబు డీఎన్ఏ తన భర్త డీఎన్ఏ కాదని తేలింది.

భర్త వీర్యకణాలకు బదులు మరొక వ్యక్తి వీర్యంతో సంతానం కలిగేలా చేసి తమను మోసం చేశారంటూ రాజస్థాన్ మహిళ సృష్టి సెంటర్ నిర్వహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపగా సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు వేరే మహిళ బిడ్డను కొనుగోలు చేసి..సరోగసి మహిళకు పుట్టిందని చెప్పి నమ్మించి ఆ బిడ్డను రాజస్థాన్ దంపతులకు అందించారని వెల్లడైంది. దీంతో డా. నమ్రతతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేయగా కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధించింది. సరోగసీతో పాటు చైల్డ్ ట్రాఫికింగ్ ఎప్పటి నుంచి ఎన్ని చేశారన్నదానిపై విచారణ చేస్తున్నామన్నామని పోలీసులు వెల్లడించారు.