peacock feather harassment | హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మహిళలపై వేధింపులు – వీడియో వైరల్, ముగ్గురు యువకులు అదుపులోకి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ముగ్గురు యువకులు మహిళలను వేధించిన ఘటన వీడియో వైరల్ అయింది. పౌరుడి జోక్యంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Three men on a bike in Hyderabad’s Jubilee Hills caught on camera harassing women with a peacock feather, later arrested by police.

హైదరాబాద్: peacock feather harassment | జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో మహిళలను బహిరంగంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి, స్కూటర్​పై వెళుతున్న మహిళలను నెమలి ఈకతో తాకుతూ అనుచితంగా వేధించగా, ఒక ధైర్యవంతుడైన పౌరుడు జోక్యం చేసుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఘటన ఎలా జరిగింది?

ఈ సంఘటన జూబ్లీహిల్స్ నీరూస్ సిగ్నల్ దగ్గర చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు, స్కూటర్​పై వెళుతున్న ఇద్దరు యువతులను బైక్‌పై అనుసరిస్తూ, నెమలి ఈకతో వారిని తాకే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని వెనుకే కారులో వస్తున్న అనికేత్ శెట్టి అనే వ్యక్తి గుర్తించి, తన భార్యతో ప్రశ్నించాడు.

వీడియోలో “ఏయ్, ఏమి చేస్తున్నావ్? ఎందుకు వేధిస్తున్నావ్ వీరిని?” అని అనికేత్​ అరవడం స్పష్టంగా వినిపించాయి.
అనికేత్ భార్య రికార్డు చేసిన ఈ ఘటనలో, బైక్ నంబర్ ప్లేట్‌ కూడా స్పష్టంగా ఉంది. తరువాత ఈ వీడియోను అనికేత్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీడియో చూడండి:

తాజాగా మాధాపూర్ పోలీసులు, “ముగ్గురు నిందితులను గుర్తించాము. వారిని అదుపులోకి తీసుకున్నాం. సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని అధికారికంగా ప్రకటించారు.

ప్రజల ప్రతిస్పందన