shocking incident | బెంగళూరులో ఘోరం చోటుచేసుకున్నది. నందిని అనే 20 ఏళ్ల అమ్మాయి.. నిర్మాణంలో ఉన్న ఒక భవంతిలోని 13వ అంతస్తునుంచి కిందపడి చనిపోయింది. దక్షిణ బెంగళూరులోని పరప్పణ అగ్రహారలో ఈ ఘటన జరిగింది. నందిని.. నగరంలోని ఒక హైపర్ మార్కెట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నది. పోలీసుల కథనం ప్రకారం నందిని, మరో ముగ్గురు ఆమె స్నేహితులు (వారిలో ఇద్దరు యువకులు) మద్యం పార్టీ చేసుకోవడానికి ఈ భవనంపైకి వెళ్లారు. నందిని అక్కడి నుంచి కిందపడటంతో భయకంపితులైన మిగిలినవారు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనలో దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ సహకారంతో ఆమె స్నేహితురాలిని ట్రేస్ చేశారు. అసలు ఏం జరిగిందనే విషయాలను పోలీసులు ఆమె నుంచి రాబట్టారు. ఒక రిలేషన్‌షిప్ విషయంలో స్నేహితుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత ‘శాడ్ రీల్’ చేయడానికి నందిని ఆ భవనం టెర్రస్‌పైకి వెళ్లింది. రీల్ రికార్డ్ చేసే క్రమంలో పట్టుతప్పి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న లిఫ్టులో గోతిలో పడిపోయింది. ఈ ఘటనతో భయానికి గురైన స్నేహితులు.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె స్నేహితుల్లో ఇద్దరు యువకులు, ఒక యువతి ఉండగా.. భవనానికి ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు.
భవనంపై వారు పార్టీ చేసుకుంటున్న విషయం వాస్తవమేనని డీసీపీ (సౌత్ ఈస్ట్) ఫాతిమా ధృవీకరించారు. పార్టీ తర్వాత వాళ్లు రీల్స్ చేసేందుకు టెర్రస్‌పైకి వెళ్లారని, అక్కడి నుంచి నందిని కిందపడిపోయిందని పేర్కొన్నారు. ఏదో రిలేషన్‌షిప్ విషయం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందనే విషయంలో తమకు ఇంకా స్పష్టత లేదని తెలిపారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇవికూడా చదవండి..
Kolkata Law College Gangrape | కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదు.. దుస్తులు తొలగించి..! : కోల్‌కతా లా కాలేజీ విద్యార్థిని భయానక అనుభవం
Tipper Aaccident: బాలుడి పైనుండి వెళ్లిన టిప్పర్ లారీ
Elephant Attacks| జగన్నాథ రథయాత్రలో అపశృతి..భక్తులపై దూసుకెళ్లిన ఏనుగు