Site icon vidhaatha

Road accident | తిరుపతికి వెళ్తున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మంది దుర్మరణం

Road accident : బెంగళూరు సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి వెళ్తున్న బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు సమీపంలోని కోలార్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version