Site icon vidhaatha

మీరు చెప్పుల‌ను అక్క‌డ విడుస్తున్నారా..? అయితే ల‌క్ష్మీదేవి రాక‌ను అడ్డుకున్న‌ట్టే..?

sandals

చాలా మంది చెప్పులు విడిచే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌రు. ఇంటి ప‌రిస‌రాల్లో, ఇంట్లో ఎక్క‌డ అంటే ఎక్క‌డ చెప్పుల‌ను వ‌దిలేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంటికి ప్ర‌మాద‌మ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

చాలా మంది త‌మ నివాసాల‌ను వాస్తు శాస్త్ర ప్ర‌కారం నిర్మించుకుంటారు. ఇంటి ముంద‌ర మెట్ల‌ను మొద‌లుకుంటే.. చివ‌ర‌కు బెడ్రూం, అందులో ఉంచే వ‌స్తువుల దాకా వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు. అయితే చాలా మంది చెప్పులు విడిచే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌రు. ఇంటి ప‌రిస‌రాల్లో, ఇంట్లో ఎక్క‌డ అంటే ఎక్క‌డ చెప్పుల‌ను వ‌దిలేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంటికి ప్ర‌మాద‌మ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చెప్పులను ఉంచ‌డానికి కూడా వాస్తు నియ‌మాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఆ వాస్తు నియ‌మాలు ఏంటో చూద్దాం..

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా..

బ‌య‌ట నుంచి ఇంట్లోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ చెప్పుల‌ను ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా విడుస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్ర‌కారం.. పాద‌ర‌క్ష‌ల‌ను మెయిన్ డోర్ ద‌గ్గ‌ర ఉంచ‌కూడ‌దు. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం పాజిటివ్ ఎనర్జీకి ముఖ్యమైనది. అందుకే ఇంటి మెయిన్ డోర్ వద్ద చెప్పులు విడవకూడద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాకను అడ్డుకున్నట్లు అవుతుందని.. క్రమంగా పేదరికం మనల్ని పట్టి పీడిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఇంటి మెయిన్ డోర్ దగ్గర చెప్పులు విడువ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో చెప్పులు పెట్ట‌కూడ‌దు..

చాలా మంది బెడ్రూంలో కూడా చెప్పుల‌ను వేసుకుని తిరుగుతుంటారు. ఏకంగా దుస్తుల‌ను ఉంచే క‌బోర్డు ప‌క్క‌నే షూ ర్యాక్ ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల‌పై ప్ర‌తికూల శ‌క్తి ప్ర‌భావం చూపుతుంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్తుతాయి. భార్య‌భ‌ర్త‌లు విడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. కాబ‌ట్టి బెడ్రూంలో చెప్పులు ఉంచ‌క‌పోవ‌డ‌మే మంచిదని చెబుతున్నారు.

మ‌రి చెప్పుల‌ను ఎక్క‌డ ఉంచాలి..

చెప్పులు, బూట్లు ఇంటికి దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచవచ్చు. చెప్పులు పెట్టుకోవడానికి ఈ రెండు దిక్కులు శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా చెప్పులు, షూస్​ పెట్టుకునేందుకు ఓపెన్​ షూ రాక్స్​ కాకుండా.. క్లోజ్డ్​ రాక్స్​ వాడమని సలహా ఇస్తున్నారు. ఈశాన్య దిశలో పొరపాటున కూడా చెప్పులు, బూట్లు పెట్టకూడదు. అలాగే ఉత్తరం, తూర్పు దిశల్లో కూడా వీటిని ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబం ఆర్థిక నష్టాలతో అప్పులపాలవుతుందని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version