Vastu Tips | హిందూ మతంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా వరకు చాలా మంది ప్రతి రోజు ఏదో ఒక దేవుడిని పూజిస్తారు. ఇంట్లోనే పూజ చేసి దీపం వెలిగిస్తారు. ఇక దేవుళ్లకు పూజల అనంతరం నైవేద్యం కూడా సమర్పిస్తుంటారు. అయితే పూజా సమయంలో వెలిగించే దీపం విషయంలో వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆ ఇంట కలహాలు ఏర్పడుతాయట. జీవితమంతా చికాకులే ఉంటాయని చెబుతున్నారు. దీపం ఈ దిశలో ఉంచి వెలిగిస్తే మహా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. మరి దీపం వెలిగించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
దీపం వెలిగించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
1. పూజా సమయంలో దీపం వెలిగించినప్పుడు ఆవు నెయ్యిని ఉపయోగించాలి. ఇతర నూనెలను ఉపయోగించరాదు.
2. దీపం వత్తి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. తూర్పు దిశలో ఉంచి దీపం వెలిగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట.
3. దీపం ఉత్తరం వైపు ఉంచి వెలిగించడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుందట.
4. దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.
5. దీపం దక్షిణ వైపు ఉంచి వెలిగించడం కారణంగా హాని కలుగుతుందట. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడి, జీవితమంతా చిక్కులే ఉంటాయట.
6. హిందూ మత ఆచారం ప్రకారం దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్ర పటం ముందు వెలిగేలా ఉంచాలి.
7. ఇంట్లో రోజూ పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణింపబడుతున్నది.