అప్పుల ఊబిలో కూరుకుపోయారా..? ఈ ఐదు నియ‌మాలు పాటిస్తే గట్టెక్కిన‌ట్లే..!

అప్పులు లేని జీవితం కోసం ప్ర‌తి ఒక్క‌రూ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. రూపాయి రూపాయి పోగేసుకున్న కూడా కొన్ని సంద‌ర్భాల్లో అప్పుల పాల‌వుతుంటాం. మోయ‌లేనంత అప్పుల ఊబిలో కూరుకుపోతాం. అయితే ఈ అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. సొంతింట్లో అయినా, అద్దె ఇంట్లో అయినా కొన్ని వాస్తు నియ‌మాలు పాటించాల‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

  • Publish Date - July 2, 2024 / 07:26 AM IST

అప్పులు లేని జీవితం కోసం ప్ర‌తి ఒక్క‌రూ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. రూపాయి రూపాయి పోగేసుకున్న కూడా కొన్ని సంద‌ర్భాల్లో అప్పుల పాల‌వుతుంటాం. మోయ‌లేనంత అప్పుల ఊబిలో కూరుకుపోతాం. అయితే ఈ అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. సొంతింట్లో అయినా, అద్దె ఇంట్లో అయినా కొన్ని వాస్తు నియ‌మాలు పాటించాల‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ నియ‌మాలు పాటిస్తే అప్పుల బాధ నుంచి విముక్తి పొందే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఆ ఐదు నియ‌మాలు ఏంటో తెలుసుకుందాం..

ఆ ఐదు నియ‌మాలు ఇవే..

1. సొంతిల్లు అయినా.. అద్దె ఇల్లు అయినా.. ఏదైనా స‌రే.. ఈశాన్య దిక్కు చాలా ముఖ్యం. ఈ దిశ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్య మూల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఆ దిశ‌లో బ‌రువైన వ‌స్తువులు, డ‌స్ట్ బిన్స్, చెప్పులు పెట్ట‌కూడ‌దని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

2. ఇక ఆగ్నేయ దిశ కూడా చాలా ముఖ్య‌మ‌ని చెబుతున్నారు. ఈ దిశ‌ను వాస్తు శాస్త్రంలో సంప‌ద మూల‌గా భావిస్తారు. ఈ దిశ‌లో ఉంచే వ‌స్తువులు సంప‌దను ఆక‌ర్షిస్తాయ‌ట‌. అందుకే ఆగ్నేయ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. అప్పుల బాధలు తగ్గుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

3. ఇక ఉత్త‌ర దిశ కూడా చాలా ముఖ్య‌మేన‌ట‌. వ్యాపారంతో పాటు త‌మ వృత్తిలో పురోగ‌తి సాధించాలంటే ఉత్త‌రం దిశపై శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సూచిస్తున్నారు. ఇంటి త‌లుపులు, కిటికీలు ఉత్త‌రం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దిశ నుంచి ఇంట్లోకి వెలుతురు, గాలి వ‌చ్చేలా ప్లాన్ చేసుకోవాలి. దీంతో ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ‌డంతో పాటు జీవితంలో విజ‌యం సాధించ‌డానికి ప‌రిస్థితులు అనుకూలిస్తాయ‌ని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

4. గోడలకు వేసే రంగుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువగా లేత రంగులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే రంగులు మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని చెబుతారు.

5. ఇంట్లో పెట్టుకున్న కొన్ని వస్తువులు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని వాస్తు పండితులు అంటున్నారు. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ, తాబేలు వంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా మార్పు కనిపిస్తుందని అంటున్నారు.

Latest News