మేషం
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. స్నేహితుల మధ్య అపార్థాలు, అనుమానాలు నెలకొంటాయి. బంధువులతో వైరం ఏర్పడటం వల్ల అశాంతిగా ఉంటారు. ఆస్తి, భూతగాదాలకు అవకాశముంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి పనులు సకాలంలో పూర్తికాక వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. సమర్ధవంతంగా సమస్యలను అధిగమిస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. గత తప్పిదాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన సమస్యలు తీరి పోతాయి. ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రాసుల వారికి ఈ రోజు ఊహించని లక్ష్మీ కటాక్షం ఉంటుంది. పాత బకాయిలు తీర్చేస్తారు. రావలసిన బకాయిలు చేతి అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.
కన్య
కన్యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజుల ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. అనుకోని సంపదలు వరిస్తాయి. వృత్తి వ్యాపార రంగాలలో అనుకూలతలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
తుల
తులారాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి చాలా పెరుగుతుంది. శ్రమతోనే విజయం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే మంచిది. అనారోగ్య సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. డబ్బు నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తీరిక లేకుండా పని చేయాల్సి రావడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అన్ని వైపుల నుంచి సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం, ఆర్థిక లాభాలు ఉంటాయి. విజయం మీ కష్టానికి ప్రతిఫలం. ఉద్యోగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార రంగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. జలగండం ఉంది కాబట్టి నీటికి దూరంగా ఉండండి.