Nail Biting | గోళ్లు కొరికే అల‌వాటు ఉందా..? అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన‌ట్టేన‌ట‌..!

Nail Biting | చాలా మందికి గోళ్ల‌ను కొర‌క‌డం( Nail Biting ), తిన‌డం అల‌వాటుగా ఉంటుంది. కానీ ఇది పెద్ద ప్ర‌మాదాన్ని కొని తెస్తుంద‌ని గ్ర‌హించాలి. గోళ్ల‌ను కొర‌క‌డం, తిన‌డం వ‌ల్ల గ్ర‌హా దోషాలు( Graha Dosham ) ఏర్ప‌డి జీవితాంతం ఆర్థిక క‌ష్టాలు( Finance Problems ) ఏర్ప‌డి, అప్పుల( Debts ) ఊబిలో చిక్కుకుపోతార‌ట‌. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Nail Biting | గోళ్లు కొర‌క‌డం( Nail Biting ) అనేది కొంద‌రికి సాధార‌ణ అల‌వాటుగా ఉంటుంది. నిత్యం నోట్లోనే వేలు పెట్టి గోళ్ల‌ను కొరుకుతుంటారు. ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్( Very Bad Habbit ) అయిన‌ప్ప‌టికీ.. అలానే గోళ్ల‌ను కొరికి న‌మిలి మింగుతుంటారు. ఇది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు( Health Issues ) దారి తీయ‌డ‌మే కాదు.. మ‌న జాత‌క చ‌క్రంలో గ్ర‌హాల అశాంతికి కూడా కార‌ణ‌మ‌వుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్ర‌హాల అశాంతి కార‌ణంగా అప్పుల( Debts ) ఊబిలో చిక్కుకు పోయిన‌ట్టే అని పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గోళ్ల‌ను కొరికి తిన‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు ఏంటో తెలుసుకుందాం..