ఇంట్లో పూజ‌లందుకునే గ‌ణ‌నాథుడు అర‌చేతికి మించ‌కూడదా..? ఎంత వ‌ర‌కు నిజం..!

  • Publish Date - April 3, 2024 / 05:50 AM IST

విఘ్నాల‌ను తొల‌గించే వినాయ‌కుడిని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో భ‌క్తితో పూజిస్తారు. ప్ర‌తి బుధ‌వారం ప‌సిబిడ్డ‌ల నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఇంట్లోనే గ‌ణ‌నాథుడికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేసి, త‌మ మొక్కులు స‌మ‌ర్పించుకుంటారు. అంతేకాక విఘ్నేశ్వ‌రుడిని ఇంట్లో పూజించే వారు ఈ నియ‌మాలు పాటించాల‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో పూజ‌లందుకునే గ‌ణ‌నాథుడు ఏ సైజులో ఉండాలి..? అర‌చేతికి మించ‌కూడదా..? మించితే ఏమ‌వుతుంద‌నే విష‌యాల‌ను తెలుసుకుందాం..

ఇంట్లో పూలందుకునే విఘ్నేశ్వ‌రుడు మ‌న బొట‌న‌వేలికి మించ‌కుండా ఉండేలా చూసుకోవాల‌ని పండితులు సూచిస్తున్నారు. వ్ర‌తాలు చేసేట‌ప్పుడు మాత్రం అర‌చేతికి మించ‌కుండా ఉండే విగ్ర‌హాలు చూసుకోవ‌డం మంచిది. అయితే పెద్ద విగ్ర‌హాల‌ను ఇంట్లో పెట్టుకుంటే.. ఆ స్థాయిలోనే ధూప‌దీప నైవేద్యాలు నిర్వ‌హించాలి. కాబ‌ట్టి ఇంట్లో పూజ‌లు చేసుకునే గ‌ణ‌నాథుడు.. అర‌చేతికి మించ‌కుండా ఉండే విగ్ర‌హాల‌ను మాత్ర‌మే వాడాల‌ని సూచిస్తున్నారు పండితులు.

ఇక తొండం ఎడ‌మ వైపు ఉన్న వినాయ‌కుడికి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి విఘ్నేశ్వ‌రుడిని పూజించ‌డం వ‌ల్ల ఏ ప‌ని ప్రారంభించినా విజ‌య‌వంతం అవుతుంద‌ని చెబుతున్నారు. తొండం కుడివైపు ఉన్న వినాయ‌కుడిని పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని చెబుతున్నారు. అయితే ఇలాంటి విగ్ర‌హాన్ని పూజించేట‌ప్పుడు ఎంతో నియ‌మ‌నిష్ట‌ల‌తో పూజించాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు. విఘ్నేశ్వ‌రుడి తొండం మ‌ధ్య‌లో ఉండే విగ్ర‌హాల‌ను పూజిస్తే.. ఇంట్లో ఉండే దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు. ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు కూడా శ‌క్తి ల‌భిస్తుంది. ఇలాంటి వినాయకుడిని పూజిస్తే వారు చేపట్టిన ప్రతి పనిలోనూ… కెరీర్ లోనూ సక్సెస్ అవుతారని చెబుతున్నారు.

Latest News