మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు తగదు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. కుటుంబంలో ప్రశాంతతకు భంగం కలిగించే పనులకు దూరంగా ఉండండి. ఆస్తి వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేయండి. ఖర్చులు పెరుగుతాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిపరంగా ఫలవంతమైన రోజు. మీ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటుంది. తోటి ఉద్యోగులు మీ నుంచి స్ఫూర్తి పొందుతారు. ఆర్ధికంగా అత్యంత ఫలదాయకమైన రోజు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. సన్నిహితుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మీకు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులూ, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ప్రతిష్టకు భంగం కలిగే పనులు చేయవద్దు.
సింహం (Leo)
అన్ని రంగాల వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మునుపెన్నడూ చూడని లాభాలు చూస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. స్థానచలనం సూచన కూడా ఉంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగిపోతాయి. అనుకోని అవాంతరాలు వచ్చినా మనోబలాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో కృషిచేస్తే అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి ఈ పరిచయం దోహదపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్టు, న్యాయ పరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనిఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది మీ ప్రతిభతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం వంటివి చేయండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ రోజు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా గత కొంతకాలంగా పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. సహచరుల సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. సన్నిహితుల నుంచి అద్భుతమైన కానుకలు అందుకుంటారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదురయ్యే పోటీని సమర్ధవంతంగా అధిగమిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.