Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి కుటుంబంలో క‌ల‌హాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేసి కీర్తి సంపాదిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలతో మేలు జరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబంలో సామరస్యత లోపించవచ్చు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సర్వ శుభప్రదమైన కాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలను చేరుకుంటారు. అధికారుల సహకారంతో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా పనిచేస్తే ఆటంకాలు తొలగుతాయి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అపారమైన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఇంటా బయటా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఉన్నతమైన ఆలోచనా విధానంతో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. బాటలో నడుస్తాయి. ధనసంపదలు పెరుగుతాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నిర్లక్ష్య వైఖరి తగదు. గ్రహ సంచారం అనుకూలించడం లేదు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అధికారులతో వినయంగా ప్రవర్తించాలి. కీలక వ్యవహారాల్లో పురోగతి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఒక వ్యవహారంలో ధననష్టం సంభవించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. గ్రహాల అనుకూలతతో విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ క్రమంగా సర్దుకుంటాయి. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తగ్గుతాయి. కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

Latest News