Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో వివాదాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ ధర్మనిష్ఠ మీ గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థికంగా స్థిరమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారులకు కొత్తగా ఆరంభించే వెంచర్స్ లాభదాయకంగా ఉంటాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమోషన్, జీతం పెరుగుదల సూచన ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారు ఆచి తూచి అడుగేయాలి. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచి తూచి అడుగేయాలి. శాంతంగా వ్యవహరించడం వలన మేలు జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థికంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలు చక్కబెడతారు. మనఃసౌఖ్యం ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావాలంటే తీవ్రంగా శ్రమించాలి. వృత్తి రీత్యా ఏర్పడే నూతన పరిచయాలు మున్ముందు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఎదురవుతాయి. కెరీర్​లో విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ, గృహ ధనలాభాలున్నాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. సంతానం నుంచి శుభవార్త వింటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఆచి తూచి నడుచుకోవాలి. కీలక పెట్టుబడులు, నూతన ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు అశాంతి కలిగిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి, ఆర్థిక లాభాలతో ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవానుగ్రహంతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ధర్మబుద్ధితో వ్యవహరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఉండవచ్చు. సమష్టి కృషి విజయాన్నిస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలత ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు, మనస్పర్థలకు అవకాశం ఉంది.

Latest News