మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజంతా సుఖంగా, శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ శక్తివంతంగా ఉంటారు. ప్రారంభించిన పనులు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్థికలబ్ధి ఉండవచ్చు. వ్యాపారపరంగా ఈ రోజు లాభపడవచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి పరమైన సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా లేదు. ఖర్చులు పెరగడం, ఆదాయం క్షీణించడం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. ప్రియమైన వారితో విభేదాలు తలెత్తవచ్చు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవబలం, పెద్దల ఆశీర్వాద బలంతో అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుస్తారు. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారులు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకుంటారు. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో శత్రువుల కారణంగా ఆటంకాలు ఏర్పడవచ్చు. అవమానకర ఘటనలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో లాభాలు విశేషంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు కలిసి వస్తాయి. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.శుభకార్యాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు అమలుపరచడానికి అనువైన సమయం. ఎంతో కాలం నుంచి వాయిదా పడుతున్న కొన్ని పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మీ పరుషమైన మాట తీరు కారణంగా మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదముంది. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు, సమస్యలతో అశాంతి నెలకొంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా శక్తివంతంగా భావిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాలి. ఉద్యోగులు అధికారులతో సౌమ్యంగా మెలగాలి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వృథా ఖర్చులు నివారించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి మందకొడిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు ముందుకి వెళ్లకుండా ఆపుతాయి. ప్రణాళికాలోపంతో ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా బాధించిన సమస్యలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపరలు కొనసాగుతాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మౌనం వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. మనోబలంతో ఆటంకాలు అధిగమించవచ్చు. కీలక వ్యవహారాల్లో సమయానుకూల నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీ మాటతీరుతో బంధువులతో విరోధం పెరిగే ప్రమాదం ఉంది.
