మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహచరుల సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. మీ కల నెరవేరుతుంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వృత్తికి ఆటంకాలుగా మారుతాయి. కుటుంబ కలహాల్లో సహనం కోల్పోకుండా జాగ్రత్త పడండి. లక్ష్యసాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో చురుగ్గా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా మీ మాటలు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఆదాయం పెరుగుతుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విశేషమైన బుద్ధిబలంతో ప్రారంభించిన పనులను అవలీలగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో బ్రహ్మాండమైన యోగం ఉంది. అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఆర్థికాభివృద్ధి కలిగించే ఆలోచనలు ఆచరణలో పెడతారు. కుటుంబ వాతావరణం కలహపూరితంగా ఉండవచ్చు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులు కీలక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక పరిసితి స్థిరంగా ఉంటుంది. కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. సామాజిక, ధార్మిక కార్యకలాపాల్లో నిమగ్నం అవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్య సాధనలో ఆటంకాలు తొలగిపోతాయి. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. వృత్తి పరంగా, ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలతో ఆందోళనతో ఉంటారు. మనోధైర్యంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనం పాటిస్తే మంచి జరుగుతుంది. అనారోగ్య సమస్యలతో కలత చెబుతారు.