బుధ‌వారం వినాయ‌కుడి పూజ చేస్తున్నారా..? ఇవి స‌మ‌ర్పిస్తే ఆర్థిక క‌ష్టాలు మాయం..!

బుధ‌వారం రోజు వినాయ‌కుడిని పూజించే స‌మ‌యంలో ఇవి స‌మ‌ర్పిస్తే ఆర్థిక క‌ష్టాలు మాయం అవుతాయ‌నేది భ‌క్తుల విశ్వాసం. మ‌రి గ‌ణ‌నాథుడికి ఏం స‌మ‌ర్పించాలో తెలుసుకుందాం..

  • Publish Date - April 24, 2024 / 06:26 AM IST

హిందువులు ఏ శుభ‌కార్యం ప్రారంభించినా మొద‌ట వినాయ‌కుడి పూజ నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత‌నే మిగ‌తా కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తారు. అంతేకాకుండా ప్ర‌తి బుధ‌వారం వినాయ‌కుడిని పూజిస్తారు. ఇలా పూజించ‌డం వ‌ల్ల విఘ్నాలు తొల‌గి, శుభాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే బుధ‌వారం రోజు వినాయ‌కుడిని పూజించే స‌మ‌యంలో ఇవి స‌మ‌ర్పిస్తే ఆర్థిక క‌ష్టాలు మాయం అవుతాయ‌నేది భ‌క్తుల విశ్వాసం. మ‌రి గ‌ణ‌నాథుడికి ఏం స‌మ‌ర్పించాలో తెలుసుకుందాం..

బెల్లం

గ‌ణేషుడి పూజా స‌మ‌యంలో బెల్లం స‌మ‌ర్పిస్తే మంచిది. బెల్లం స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల వినాయ‌కుడితో పాటు ల‌క్ష్మీదేవిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌చ్చు. దీంతో వారి అనుగ్ర‌హం ల‌భిస్తే ఆర్థిక క‌ష్టాల‌న్నీ తొలగిపోతాయి. సంపాద‌న వెనుకేసుకోవ‌చ్చు.

జాజికాయ

మీకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే బుధవారం నాడు గణేశుడికి 21 లేదా 42 జాజికాయలను సమర్పించండి. ఇది మీ ఆర్థిక సమస్యలను నయం చేస్తుంది.

ల‌డ్డూ

బుధవారం నాడు గణేశునికి లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా వినాయకుడి అనుగ్రహం మీపై ఉంటుంది. అయితే ల‌డ్డూను ముఖ్యంగా బుధవారం నాడు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కుంకుమ‌

ఈ రోజున, గణపతి పూజ తర్వాత, గణేశుని నుదుటిపై కుంకుమ రాయండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. బుధవారం ఏదైనా శుభకార్యానికి వెళ్లే ముందు ఇలా చేయడం వల్ల ఆ పనిలో విజయం సాధిస్తారు.

Latest News