మీ జాతకంలో గ్రహ దోషం ఉందా..? ఎంత కష్టపడి పని చేస్తున్నా.. తగిన ఫలితం దక్కడం లేదా..? ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా..? అయితే మీరు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి దుర్గాదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.. హిందూ మతంలో దుర్గాదేవిని ఆది పరాశక్తిగా భావిస్తారు. సీజనల్ వ్యాధులు, ఇతర బాధల నుంచి దుర్గాదేవి ఉపశమనం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆది పరాశక్తిగా భావించే దుర్గాదేవిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపద, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక దుర్గామాతను నిర్మలమైన హృదయంతో ఆరాధిస్తే కొద్ది రోజుల్లోనే ఫలితం కనబడుతుంది.
ఇక శుక్రవారం పొద్దునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. ఇంటిని కూడా శుభ్రపరుచుకోవాలి. పూజాగదిని అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించాలి. ఆ తర్వాత పూజలో నిమగ్నమైపోవాలి. దుర్గామాతకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. అనంతరం కోరికలు కోరుకుని మనసారా ఆరాధించాలి. దేశీ నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. పూజా సమయంలో “ఓం హ్రీం దుం దుర్గాయై నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించే సమయంలో నేల మీద కూర్చోకుండా.. ఏదైనా ఆసనం మీద కూర్చోండి. మంత్రాన్ని జపించడానికి తులసి లేదా గంధపు జపమాల ఉపయోగించండి. సాయంత్రం మంత్రాన్ని జపిస్తే, పడమర ముఖంగా కూర్చోండి. కనీసం 40 రోజుల పాటు మంత్రాన్ని నిరంతరం జపించండి. అదృష్టానికి మూసిన తలుపులు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి.