Site icon vidhaatha

శ‌ని దోషం మిమ్మ‌ల్ని ప‌ట్టిపీడిస్తుందా..? అయితే శ‌నివారం శ‌నిదేవుడిని పూజించండిలా..!!

ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ఒక్క‌సారైనా శ‌ని ప్ర‌భావాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆ శ‌ని ప్ర‌భావం నుంచి ఉప‌శ‌ప‌మ‌నం పొందేందుకు పూజ‌లు చేస్తుంటారు. అవి ఫ‌లించి శ‌ని మ‌న నుంచి దూర‌మ‌వుతుంది. కానీ కొంద‌ర్నీ శ‌ని దోషం ప‌ట్టిపీడిస్తూనే ఉంటుంది. అనేక క‌ష్టాలు ఎదుర‌వుతుంటాయి. అలా నిత్యం శ‌ని దోషంతో బాధ‌ప‌డేవారు శ‌నివారం నాడు శ‌ని దేవుడిని ఇలా పూజిస్తే అన్ని క‌ష్టాలు మాయ‌మైపోతాయ‌ట‌. శని దేవుని అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంద‌ట‌. రాజయోగంతో వెలిగిపోతాడ‌ని పండితులు చెబుతున్నారు.

శనిదోషం.. ప్రభావం తగ్గించడానికి, శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి, జ్యోతిషశాస్త్రంలో కొన్ని ఉప‌శ‌మ‌నాలు ఉన్నాయి. జీవితంలో శనిదోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శని దేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు సూచించారు. శనీశ్వరుడుని సంతోషపెట్టడానికి శనివారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

ఏ భక్తుడు ఆంజ‌నేయుడిని ఆరాధించినా.. అతనిపై సదా శనీశ్వరుడి అనుగ్రహము ఉంటుందని ఒక నమ్మకం. శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి, జాతకంలో శని దోష నివారణ కోసం తప్పకుండ శనివారం హనుమంతుడిని పూజించాలి. ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించండి.

శ‌ని ప్రభావాన్ని తగ్గించడానికి.. శనీశ్వరుడికి అంకితం చేసిన మంత్రాలు, చాలీసాను తప్పనిసరిగా పఠించాలి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః లేదా ఓం శని శనైశ్చరాయ నమః అనే మంత్రాలను శనివారాల్లో జపించండి. ఇది కాకుండా శని దేవాలయానికి వెళ్లి శని చాలీసా పఠించి.. హార‌తినివ్వండి.

శనిదోషం తొలగి శనిదేవుని అనుగ్రహం పొందడానికి.. శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవాల నూనె, మినుములు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. పేదలకు అన్నదానం చేయండి.

శనివారం నాడు ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి మనసులో శని దేవుడిని స్మరించుకోండి. దీని తర్వాత శని దేవాలయంలో ఈ నూనెను దానం చేయండి. ఈ పరిహారం శనిదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Exit mobile version