Site icon vidhaatha

గురువారం షిర్డీ సాయిబాబాను ఇలా పూజిస్తే.. కోరిన కోరిక‌లు తీరుతాయ‌ట‌..!

గురువారం అంటేనే గుర్తొచ్చేది షిర్డీ సాయిబాబా. అందుకే ప్ర‌తి గురువారం షిర్డీ సాయిబాబాకు భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తుంటారు. తీరిక ఉన్న‌వారు బాబా ఆల‌యాల‌కు వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఇక బాబా అనుగ్ర‌హం పొందేందుకు గురువారం ఉప‌వాస దీక్ష కూడా చేస్తుంటారు. షిర్డీ సాయిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తే కోరిన కోరిక‌లు తీరుస్తాడ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

గురువారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సాయిబాబాను ధ్యానించాలి. శరీరం మనసు స్వచ్ఛంగా ఉండేలా చూసుకొని సాయిబాబా విగ్రహం ప్రతిష్టించి దానిపై గంగాజలం చల్లాలి. విగ్రహంపై పసుపు రంగు వస్త్రాన్ని కచ్చితంగా ఉంచాలి. ఆ తర్వాత పూలు, అక్షింతలు కూడా తీసుకోవాలి. బాబా నామస్మ‌రణ చేస్తూ బాబాకు పూజలు నిర్వ‌హించాలి. సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణిస్తారు. అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించాలి. పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన మిఠాయిలు ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది.

ఎప్పుడూ కులం, మతం, జీవుల మధ్య వివక్షతను చూపలేదు షిర్డీ సాయిబాబా. ఎవరైతే భక్తితో సాయిబాబా అని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని భ‌క్తులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గురువారం రోజు ఉపవాసం ఉండడం వల్ల సాయిబాబా అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Exit mobile version