Yadadri | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పాంచ నరసింహుడు యాదాద్రి( Yadadri ) లక్ష్మీనరసింహస్వామి( Lakshmi Narasimha Swamy ). తెలంగాణ( Telangana ) తిరుపతి( Tirupathi )గా ఖ్యాతి చెందిన ఈ ఆలయంలో నరసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుని అక్కడున్న విష్ణు పుష్కరిణి( Vishnu Pushkarini )లో స్నానం ఆచరిస్తే.. తప్పకుండా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
యాదాద్రిలో ఉన్న విష్ణు పుష్కరిణిలో ఇప్పటికీ ఆ పరిసరాలలో ఉన్న కొండలపై తపస్సు చేసుకునే ఋషులు స్నానమాచరించి.. స్వామి వారిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చే సమయంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కూడా కొందరు చూశారట! వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా ఇందుకు నిదర్శనమని నమ్మకం. అందుకే యాదాద్రి ఆలయ ప్రాంగణంలో 45 రోజులు ఉండి ప్రతిరోజూ విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామి సేవలో నిమగ్నమైతే అనారోగ్య సమస్యలు తొలగిపోయి, గ్రహపీడా నివారణ జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.
యాదగిరి గుట్టపై ఉన్న నృసింహుని ఆలయానికి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గాన వెళ్లే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభువుగా వెలిశాడు. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్లు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. మరో విశేషమేమిటంటే స్వామి దర్శనం కోసం ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.
ఇలా చేరుకోవచ్చు
యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బస్సు సౌకర్యం ఉంది. 65 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. భక్తులకు వసతి గృహాలు, నిత్యాన్నదాన సత్రాలు అందుబాటులో ఉన్నాయి.