Deeparadhana | హిందూ సంప్రదాయం( Hindu Customs )లో భార్యాభర్తల( Couples ) పాత్ర ప్రత్యేకమైనది. దంపతులు ఎలాంటి గొడవలు( Fighting ) పడకుండా, సంసారాన్ని సాఫీగా సాగించాలని ఆ ఇంటి పెద్దలు కోరుకుంటారు. కానీ అప్పుడప్పుడు గొడవలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీపడి మళ్లీ ఒక్కటవుతుంటారు. కానీ కొన్నిసార్లు దంపతుల మధ్య నిత్యం గొడవలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇలాంటి వారికి జ్యోతిష్య పండితులు ఓ సూచన చేస్తున్నారు. అదేంటంటే.. కొబ్బరి నూనె( Coconut Oil ) తో దీపారాధన( Deeparadhana ) చేయడం.
ఇంట్లో పూజా సమయంలో కొబ్బరి నూనె( Coconut Oil )తో దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) పోయి.. పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) నెలకొంటుంది. పాజిటివ్ ఎనర్జీతో దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారని, వారి సంసారం సుఖసంతోషాల మధ్య సాగిపోతుందని చెబుతున్నారు.
40 రోజుల పాటు మహాలక్ష్మీ దేవి( Lakshmi Devi )కి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి.. పంచదార( Sugar ) లేదా తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తొలగిపోతాయట. ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ఇంట్లో తరచూ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల శుభకార్యాలు జరుగుతాయట. రావి చెట్టు కింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు, శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుందట. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.