అమ్మవారికి బంగారు బోనం,పట్టువస్త్రాలు సమర్పించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

విధాత‌:చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 113వ వార్షికోత్సవాల్లో భాగంగా భారతదేశంలోని 18 శక్తీ పీఠాలకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలయ చైర్మన్ కె.వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీశైలం గ్రామదేవతలైన శ్రీ అంకాలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో పాటు జోగిని నిషాక్రాంతి తలపై బోనం పెట్టుకుని బజాబజంత్రీలతో ఊరేగింపుగా భ్రమరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ఏ ఈ ఓ […]

  • Publish Date - August 7, 2021 / 05:00 AM IST

విధాత‌:చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 113వ వార్షికోత్సవాల్లో భాగంగా భారతదేశంలోని 18 శక్తీ పీఠాలకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలయ చైర్మన్ కె.వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీశైలం గ్రామదేవతలైన శ్రీ అంకాలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో పాటు జోగిని నిషాక్రాంతి తలపై బోనం పెట్టుకుని బజాబజంత్రీలతో ఊరేగింపుగా భ్రమరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ఏ ఈ ఓ హరిదాస్ లాల్ దర్వాజా ఆలయ కమిటీ సభ్యులకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం భ్రమరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలోని 18 శక్తీ పీఠాలకు ఆషాఢమాసంలో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం తరపున బంగారు బోనం,పట్టువస్త్రాలు సమర్పించాలని ఆలయ కమిటీ నిర్ణయం మేరకుమొట్ట మొదటిసారిగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి శుక్రవారం బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని వెంకటేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు ఎ. బద్రీనాథ్ గౌడ్, సీరా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి.మారుతీ యాదవ్, కోశాధికారి జి. అరవింద్ కుమార్ గౌడ్,కమిటీ ప్రతినిధులు జి. మహేష్ గౌడ్, కె.విష్ణు గౌడ్,జె.లక్ష్మీనారాయణ గౌడ్, ఎ. మానిక్ ప్రభూ గౌడ్,జి. కాశీనాథ్ గౌడ్,పి.విజయ్ కుమార్,ఎ. చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News