Site icon vidhaatha

శుక్ర‌వారం ల‌క్ష్మీదేవికి ఈ నైవేద్యం పెడితే చాలు.. చేతినిండా డ‌బ్బులే..!

ప్ర‌తి శుక్ర‌వారం ల‌క్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఎందుకంటే ల‌క్ష్మీదేవికి శుక్ర‌వారం అంటే ఎంతో ప్రీతి. కాబ‌ట్టి ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు నిత్యం ల‌క్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. ఆమె అనుగ్ర‌హం కోసం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తుంటారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించ‌డ‌మే కాదు.. ఆమెకు ఇష్ట‌మైన నైవేద్యాల‌ను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల చేతి నిండా డ‌బ్బులు ఉంటాయ‌ని, ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఇక ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల క‌ల్లా నిద్ర లేవాలి. ఆ త‌ర్వాత స్నానం చేసి, పాల‌ను బాగా మ‌రిగించాలి. పాల‌పై వ‌చ్చిన మీగ‌డ‌ను తీసుకొని భ‌ద్ర‌ప‌ర‌చాలి. ఇక శుక్ర‌వారం వ‌ర‌కు మీగ‌డ‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. శుక్ర‌వారం తెల్ల‌వారుజామునే స్నానం చేసి పూజా గ‌దిని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఆ త‌ర్వాత లక్ష్మీదేవిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలి. మీగ‌డ‌ను చెక్క‌కవ్వంతో చిల‌క‌గా వ‌చ్చిన వెన్న‌కు ప‌టిక బెల్లాన్ని క‌లిపి ల‌క్ష్మీదేవికి నైవేద్యంగా స‌మ‌ర్పించాలి.

పూజా ముగిశాక ఆ నైవేద్యాన్ని పిల్ల‌ల‌కు తినిపించాలి. ఇలా 11 వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది.. ఇక మీరు సంపాదించిన సొమ్ము మొత్తం డబుల్ అవుతుంది.. కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.. మీరు కోటీశ్వర్లు అవుతారు..పూజించే సమయంలో ఎలాంటి తప్పు చేయవద్దు.

Exit mobile version