Vastu Tips | భర్త( Husband ) తన భార్యాపిల్లలకు ఏ లోటు రానివ్వకుండా కష్టపడుతుంటాడు. అంటే ఆర్థికంగా ఎదిగేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తాడు. ధనం( Money ) సమకూర్చుతాడు. కుటుంబ సభ్యులకు బెట్టర్ లైఫ్‌ను ఇస్తుంటాడు. అయితే భర్త సంపాదించిన ధనం కొద్ది రోజుల పాటు నిలవాలంటే.. భార్య( Wife ) ఈ పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం..
ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు..
చాలా మంది మహిళలు( Womens ).. పొద్దున తన భర్త( Husband ) ఉద్యోగానికో లేదా వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లగానే.. తలుపులు( Doors ) మూసేస్తుంటారు. కానీ ఇలా తలుపులు మూసివేయకూడదట. కనీసం ఐదు నిమిషాల పాటు ఇల్లు తెరిచి ఉంచి, ఆ తర్వాత తలుపులు మూసినా.. భర్త సంపాదనకు ఎలాంటి ఆటంకం కలగదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఇంటి నుంచి భర్త వెళ్లగానే మహిళలు చేసే పొరపాటు ఏంటంటే.. ఇల్లు ఊడ్చడం( House Cleaning ). అలా చీపురుతో ఇల్లు ఊడ్చడం కారణంగా భర్త కష్టపడి సంపాదించిన ధనం అంతా.. ఊహించని విధంగా ఖర్చు అవుతుందట. తడి వస్త్రంతో అసలే ఇల్లు తుడవకూడదట.
కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్లగానే స్నానం( Bath ) చేయడానికి వెళ్తుంటారు. కానీ.. వెంటనే స్నానానికి వెళ్లకుండా.. 5 నిమిషాలు ఆగి వెళ్లాలి. అప్పుడే భర్తకు మంచి జరుగుతుందని, కూడబెట్టిన సొమ్ము కూడా ఎక్కువ కాలం ఉంటుందట.
ఉతికిన బట్టలను మడతబెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు. బట్టలను తలకిందులుగా మడతబెడితే భర్తకు అదృష్టం కలసిరాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.