పెళ్లి కావ‌డం లేదా..? గురువారం ఉప‌వాసం ఉండి ఈ దేవుడిని పూజించండి..!

గురువారం నాడు విష్ణువును పూజిచండం వ‌ల్ల జీవితంలోని క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి. అంతేకాకుండా పెళ్లి కాకుండా ఇబ్బంది ప‌డుతున్న‌వారికి ఆటంకాల‌న్నీ తొల‌గిపోయి, పెళ్లి అయ్యే అవ‌కాశం ఉంటుంది.

  • Publish Date - April 18, 2024 / 06:26 AM IST

హిందూ ధ‌ర్మంలో శ్రీ మ‌హా విష్ణువు, దేవ‌గురు బృహ‌స్ప‌తి ఆరాధ‌న‌కు గురువారం చాలా ప‌విత్ర‌మైన‌దిగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. గురువారం నాడు విష్ణువును పూజిచండం వ‌ల్ల జీవితంలోని క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి. అంతేకాకుండా పెళ్లి కాకుండా ఇబ్బంది ప‌డుతున్న‌వారికి ఆటంకాల‌న్నీ తొల‌గిపోయి, పెళ్లి అయ్యే అవ‌కాశం ఉంటుంది. నియ‌మ నిష్ట‌ల‌తో శ్రీ మ‌హావిష్ణువును ఆరాధిస్తే కోరిన కోర్కెలు త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌నేది న‌మ్మ‌కం. గురువారం రోజు ఉప‌వాసం ఉంటే ఇంకా మంచిద‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉప‌వాసం చేయ‌డం విష్ణువు మాత్ర‌మే కాదు.. ల‌క్ష్మీదేవి కూడా సంతోషిస్తుంద‌ట‌. పూజా, ఉప‌వాస విధానం తెలుసుకుందాం..

ఈ మంత్రాన్ని జ‌పించాలి..

గురువారం తెల్ల‌వారుజామునే బ్ర‌హ్మ ముహుర్తంలో నిద్ర మేల్కొనాలి. ఆ త‌ర్వాత పసుపునీటితో అభ్యంగ‌స్నానం చేయాలి. అనంత‌రం ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. విష్ణువును ఆరాధించిన త‌ర్వాత నైవేద్యం స‌మ‌ర్పించి, మొక్కులు తీర్చుకోవాలి.

రావిచెట్టుకు పూజ‌లు చేయాలి..

గురువారం రోజు విష్ణువును ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే రావిచెట్టుకు పూజ‌లు చేయాలి. ఈ చెట్టుకు పూజ‌లు చేయ‌డం ద్వారా ఆశీర్వాదం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఆ ఇంట సుఖ‌సంతోషాలు ల‌భిస్తాయ‌ని విశ్వాసం. రావి చెట్టు వేరులో బ్రహ్మ, కొమ్మలో విష్ణువు, పైభాగంలో శివుడు ఉంటాడని నమ్ముతారు. ఈ రోజున తులసిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుంది.

ఉప‌వాసం ఉండి అర‌టి చెట్టును పూజించాలి..

వివాహంలో ఏ విధమైన జాప్యం జరుగుతున్నా.. లేదా వైవాహిక బంధం ఏర్పరచుకోవడంలో అడ్డంకులు ఏర్పడుతున్నా.. అటువంటి వారు ఖచ్చితంగా గురువారం ఉపవాసం పాటించాలి. విష్ణువుతో పాటు అర‌టి చెట్టును పూజిస్తే ఫ‌లితం త్వ‌ర‌గా ఉంటుంది. గురువారం ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలన్నింటిని తొలగిస్తుంది.

నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి..

హిందూ మతంలో ప్రతిరోజూ నుదుటిపై తిలకం దిద్దే హిందూ సంప్రదాయంలో ఉంది. అయితే బృహస్పతి, శ్రీ మహా విష్ణువుల ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా గురువారం రోజున కుంకుమ పెట్టుకోవాలని నమ్ముతారు. ఎక్కడికైనా బయటకు వెళుతుంటే నుదిటిపై కుంకుమ ధరించి బయటకు వెళ్లాలి. కుంకుమ అందుబాటులో లేకుంటే పసుపును కూడా ఉపయోగించవచ్చు.

Latest News