Vastu Tips | మనిషికి విశ్రాంతి చాలా అవసరం. ఈ విశ్రాంతి కోసం యోగా( Yoga ), ధ్యానం( Meditation ) చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అన్ని పనులకు దూరంగా ఉండి, ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకుంటుంటారు. కొందరు విశ్రాంతి కోసం నిద్రిస్తుంటారు. అయితే ఈ నిద్ర( Sleep )కు కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయని వాస్తు పండితులు చెబుతున్నారు. విశ్రాంతి కోసం నిద్రించినా.. రాత్రి వేళ సాధారణంగా నిద్రించినా.. వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు.
కొందరు ఇష్టమొచ్చినట్లు నిద్రిస్తుంటారు. దిశతో సంబంధం లేకుండా తల పెట్టి నిద్రలో మునిగి తేలుతుంటారు. ఇలాంటి వారికి జీవితంలో అనేక చికాకులు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి నిద్రించే సమయంలో తలను ఉత్తర దిశలో ఉంచకూడదు. ఈ తప్పు తెలిసి చేసినా, తెలియకుండా చేసినా.. అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఉత్తర దిశ దేవత నివాసం కాదు.. కాబట్టి ఈ దిశలో తల పెట్టి నిద్రిస్తే శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు హెచ్చరించారు. అంతేకాకుండా ఈ దిశలో తల పెట్టి నిద్రపోయే వ్యక్తికి శక్తి తగ్గుతుంది.
ఉత్తర దిశ కాకుండా మిగతా మూడు దిశల్లో ఎక్కడైనా తల పెట్టి పడుకోవచ్చని పండితులు చెబుతున్నారు. దక్షిణం వైపు తల పెట్టి నిద్రిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. తూర్పు వైపు కూడా తలపెట్టి నిద్రించడం కారణంగా ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట. కాబట్టి ఈ దిశల్లో తలపెట్టి నిద్రించే విధంగా ప్రణాళిక చేసుకుంటే మంచిది.