Site icon vidhaatha

Tulasi Plant | ఎండిన తుల‌సి ఇంట్లో ఉంటే శుభ‌మా..? అశుభ‌మా..?

Tulasi Plant | హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. తుల‌సి మొక్క‌ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్ర‌తి ఇంట్లో తుల‌సి మొక్క ఉంటుంది. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం వేళ తుల‌సి మొక్క‌కు నీరు పోసి, పూజిస్తుంటారు. ఈ పవిత్ర‌మైన తుల‌సి మొక్క‌లో ల‌క్ష్మీదేవి నివ‌సిస్తుంద‌ని హిందూవులు న‌మ్ముతుంటారు. కాబ‌ట్టి తుల‌సి మొక్క‌ను పూజిస్తే.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు. అంతేకాకుండా ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ని న‌మ్ముతుంటారు.

అయితే వాడిపోయిన‌, ఎండిన తుల‌సి మొక్క ఇంట్లో ఉంటే శుభ‌మా..? అశుభ‌మా..? అస‌లు ఎండిన తుల‌సికి పూజ‌లు చేయొచ్చా..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. జ్యోతిష్య నిపుణుల ప్ర‌కారం.. ఎండిన తుల‌సి మొక్క‌కు పూజ‌లు చేయ‌కూడ‌దు. ఎండిన తుల‌సి మొక్క‌కు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అశుభం క‌లుగుతుంద‌ని చెబుతున్నారు. ఎండిపోయిన తుల‌సి వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి కూడా పెరిగిపోయి ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు. కాబ‌ట్టి తులసి ఎండిపోయిన వెంటనే దానిని తీసివేసి కొత్త మొక్కను నాటుకోవాలి.

మ‌రి ఎండిన తుల‌సి మొక్క‌ను ఏం చేయాలి..?

అదే సమయంలో ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ కూడా విసిరేయ కూడదు. మంట‌ల్లో కూడా కాల్చ‌కూడదు. ఇలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. అయితే ఎండిన తులసి మొక్కను భూమిలో మాత్ర‌మే పాతిపెట్టాలి. పొరపాటున కూడా తులసిని రాత్రి సమయంలో ఇంట్లో నుంచి తీసి బయట ప‌డేయ‌కూడదు. ల‌క్ష్మీదేవి నివ‌సించే తులసి మొక్కను పొరపాటున కూడా పాదాలతో తాకవద్దు.

Exit mobile version