Zodiac Signs | చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. అందులోనూ ఏ పని చేయాలన్నా.. ముందుగా ఆ రోజు తమ రాశి ఫలాలకు( Zodiac Signs ) అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. అయితే గ్రహాల్లో మార్పుల కారణంగా వారి వారి జాతక ఫలాలు( Horoscope ) కూడా మారుతుంటాయి. ఈ నాలుగు రాశుల వారికి సెప్టెంబర్( September ) నెలంతా కష్టాలు ఎదురవుతాయని, జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం..
కన్యా రాశి( Virgo )
సెప్టెంబర్ నెలంతా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా, అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందట. ఇక ఖర్చులు కూడా ఆదాయానికి మించిపోయే అవకాశం ఉందని, దాంతో ఇతరుల వద్ద స్థాయికి మించి అప్పులు చేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. సో బీ కేర్‌ఫుల్.
సింహ రాశి ( Leo )
సింహ రాశి వారికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయట. ప్రధానంగా ఆర్థిక సమస్యలు పట్టిపీడించనున్నాయట. స్థాయికి మించిన ఖర్చుతో అనేక సమస్యలు సృష్టించబడుతాయట. కుటుంబ కలహాలు కూడా అధికమయ్యే అవకాశం ఉందట. అందుకే అనవసర విషయాల్లో తలదూర్చొద్దని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాగ్వాదం జరిగే ఛాన్స్ ఉంటుందంట.
మిథున రాశి (Gemini)
మిథున రాశి వారికి మాత్రం గ్రహాలు ఏ మాత్రం అనుకూలంగా లేవట. అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురుకానున్నాయట. ఆర్థిక సమస్యలు సంభవించే ప్రమాదం ఉందట. శత్రువులు మీ పై కుట్రలు చేసేందుకు ఛాన్స్ ఉందట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. పని చేసే ప్రదేశంలోనూ సమస్యలు ఉత్పన్నమై విధులకు భంగం కలిగే అవకాశం ఉందట. తోబుట్టువులతో సంబంధాలు బలహీనపడి.. ఇంట్లో చికాకులు అధికమయ్యే అవకాశం ఉందట.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా కష్టకాల సమయం అని చెప్పాలి. ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యాపారవేత్తలు అస్సలే తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదంట. లేకపోతే ఇవి లాభాలు పొందే ఛాన్స్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.