Vinayaka Chavithi | వేద పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్ధి తిథి నాడు వినాయక చవితి( Vinayaka Chavithi ) పండుగను హిందువులు( Hindus ) జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసగ్టు 27వ తేదీన అంటే బుధవారం రోజున గణేశ్ చతుర్ధి( Ganesh Chaturthi )ని నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు భక్తులు. గణపయ్యకు ఇష్టమైన పువ్వులు, పత్రితో పూజలు చేస్తారు. నైవేద్యంగా కుడుములు, పండ్లు వంటి సమర్పించి భక్తిని చాటుకుంటారు.
ఇక పూజలు చేయడంతో పాటు దీపం వెలిగిస్తే.. శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ దీపాన్ని ఎక్కడంటే అక్కడ వెలిగించకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే.. ప్రత్యేకమైన ప్రదేశంలోనే దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి నాశనమై.. ఆ ఇంటి యజమానులు కోటీశ్వరులైపోతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ ప్రదేశంలో దీపం వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
మరి ఏ దిశలో దీపం వెలిగించాలి…?
సనాతన ధర్మం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి వినాయక నవరాత్రుల సందర్భంగా సాయంత్రం వేళ కచ్చితంగా దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంటి ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. కుటుంబ సభ్యులపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి. ఇక పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
ఆహారం, డబ్బుకు కొరత ఉండదు సనాతన ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి ఈ మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున సాయంత్రం తులసిని పూజించి , స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. మొక్కకు ఏడు లేదా ఐదు సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని.. ఇల్లు సిరి సంపదలతో ఉంటుందని.. తినడానికి లోటు ఎప్పుడూ ఉండదని నమ్ముతారు. ఆర్థిక సంక్షోభ సమస్య నుంచి బయటపడతారు.