Site icon vidhaatha

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. 18న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TTD | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల నుంచి 22న 12 గంటల్లోగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. 22న మధ్యాహ్నం తర్వాత లక్కీడీప్‌లో టికెట్లు పొందినవారు డబ్బులు చెల్లించి టికెట్లు కన్ఫర్మ్‌ చేసుకోవాలని సూచించింది.

ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17 వ‌ర‌కు నిర్వహించనున్న వార్షిక ప‌విత్రోత్సవాల సేవా టికెట్లను మే 21న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు చెప్పింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది.

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్‌లైన్‌ కోటాను కోటాను 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నది.

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది. 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

Exit mobile version