Site icon vidhaatha

Ugadi Panchangam | క్రోధినామ సంవ‌త్స‌రంలో మీ రాశి ఆదాయ – వ్య‌యాలు ఎలా ఉన్నాయంటే..?

rashulu-adayavyayalu

Ugadi Panchangam | మ‌రో రెండు రోజుల్లో శోభ‌కృత్ నామ సంవ‌త్స‌రం పూర్తి కాబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన క్రోధినామ సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఇక గ‌త సంవ‌త్స‌రం ఆయా రాశుల ఆదాయ‌, వ్య‌యాల‌ను బ‌ట్టి కొంద‌రు ఆనంద‌క‌ర జీవితం గ‌డిపితే, మ‌రికొందరు క‌ష్టాల‌తో కూడిన జీవితం గ‌డిపి ఉండొచ్చు. మ‌రి ఈ ఏడాది మీ రాశి ప్రకారం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి
ఆదాయం: 8 , వ్యయం:14
రాజపూజ్యం:4 , అవమానం:3

వృషభ రాశి
ఆదాయం : 2 వ్యయం : 8
రాజ్యపూజ్యం : 7 అవమానం : 3

మిథునరాశి
ఆదాయం : 5 వ్యయం : 5
రాజ్యపూజ్యం : 3 అవమానం : 6

కర్కాటక రాశి
ఆదాయం : 14 వ్యయం : 2
రాజ్యపూజ్యం : 6 అవమానం : 6

సింహ రాశి
ఆదాయం : 2 వ్యయం : 14
రాజ్యపూజ్యం:2 అవమానం : 2

కన్యా రాశి
ఆదాయం : 5 వ్యయం : 5
రాజ్యపూజ్యం : 5 అవమానం : 2

తులా రాశి
ఆదాయం : 2 వ్యయం : 8
రాజ్యపూజ్యం:1 అవమానం : 5

వృశ్చిక రాశి
ఆదాయం : 8 వ్యయం : 14
రాజ్యపూజ్యం : 4 అవమానం : 5

ధనస్సు రాశి
ఆదాయం : 11 వ్యయం : 5
రాజ్యపూజ్యం : 7 అవమానం : 5

మకర రాశి
ఆదాయం : 14 వ్యయం : 14
రాజ్యపూజ్యం : 3 అవమానం : 1

కుంభ రాశి
ఆదాయం : 14 వ్యయం : 14
రాజ్యపూజ్యం : 6 అవమానం : 1

మీన రాశి
ఆదాయం : 11 వ్యయం : 5
రాజ్యపూజ్యం :2 అవమానం :4

ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతోకొంత మిగులుస్తారు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చుపెట్టేస్తారు- అంటే లాభం నష్టం రెండూ ఉండవు.

రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించే వారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్యే ఎక్కువన్నమాట. రాజపూజ్యం-అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు.

 

Exit mobile version