Vastu Tips | కుటుంబాన్ని పోషించేందుకు సరైన ఆదాయ మార్గాలు( Income Sources ) లేని వారు అప్పులు చేస్తుంటారు. అవి సకాలంలో చెల్లించకపోవడంతో.. అసలు, వడ్డీ కలిపి భారంగా మారుతాయి. అయితే ఇలా అప్పులతో( Debts ) బాధపడేవారు చిన్న వాస్తు నియమాలు( Vastu Tips ) పాటిస్తే సరిపోతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఓ మూడు మొక్కలను ఇంట్లో నాటుకోవడం వలన అప్పుల నుంచి శాశ్వతంగా బయటపడొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు మొక్కలు ఏవో తెలుసుకుందాం.
బంతి పూల మొక్క( Marigold Plant )
బంతి పువ్వులు రకరకాల రంగుల్లో ఉండి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఇంటికి అందమే కాకుండా, వాస్తు పరంగా కూడా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. బంతి పూల మొక్కలను ఎవరైతే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాటుతారో.. ఆ ఇంట్లో అప్పుల బాధలే ఉండవట.
మనీ ప్లాంట్( Money Plant )
ఇక మనీ ప్లాంట్ మొక్క చాలా మంది నివాసాల్లో ఉంటుంది. సంపదకు చిహ్నంగా భావించే మొక్క.. ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో.. వారికి ఆర్థికంగా కలిసి వస్తుందట. సరైన దిశలో ఈ మొక్కను పెంచితే సంపద పెరుగుతుందట. వాస్తు ప్రభావంతో ఎవరైనా అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే వారు ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం మంచిదంట.
వెదురు( Lucky Bamboo )
లక్కీ వెదురు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఇది ఇంటిలో ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు. అందువలన ఎవరైనా సరే తమ ఇంటిలో లక్కీ వెదురు నాటుకోవడం వలన అప్పుల సమస్యలు తొలిగిపోయి, ఇంటిలోపల సంపద పెరుగుతుందంట.
