మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి గురించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతితో ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పెంచుకోవడంపై దృష్టి సారించండి. అనవసర కలహాలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు కష్టపడితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కొంతకాలం వేచి ఉంటే మంచిది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా విశేష లాభాలు అందుకుంటారు. విద్యార్థులు కఠిన శ్రమతోనే విజయం సాధించగలరు. ఒక శుభవార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తొలగుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలకు, వ్యాపార విస్తరణకు శుభ సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటుంది. విద్యార్థులు తమ చదువులపై మరింత దృష్టి పెట్టాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్, వ్యాపార పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ముందుచూపుతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించగలరు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ వంటి ప్రయోజనాలు పొందుతారు. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పదవీయోగం ఉంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కీలక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాల్లో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు రావడంతో ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు కలిసివచ్చే సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయపరంగా శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వ్యాపారులు సరైన వ్యూహంతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో చేయడం అవసరం. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది, కాబట్టి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి.