మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. గతంలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. అధికారులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనవసర చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకోండి. వ్యాపారులు ఈ వారం కొత్త పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభాలు పెరిగినా ఖర్చులు అదుపు తప్పడంతో ఆందోళనకు గురవుతారు. అవసరానికి డబ్బు అందడం కష్టమవుతుంది. వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంతో ఆనందకరమైన సమయం గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో మంచి యోగం ఉంది. కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు సరైన సమయం. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. కీలకమైన ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తే భారీగా నష్టపోతారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సవాళ్లను నిర్లక్ష్యం చేయవద్దు. పెద్దల, అనుభవజ్ఞుల సలహాలతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వీలైనంత వరకు స్వీయ నిర్ణయాలతోనే ముందుకెళ్లడం మంచిది. మితిమీరిన ఆత్మవిశ్వాసం సమస్యలు తీసుకురావచ్చు. వ్యాపారులకు కొత్తగా ఏర్పడే పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. లాభాలు పెరగడం ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు సమస్యలు సృష్టించవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గట్టి ప్రయత్నం చేస్తే విజయం లభిస్తుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఒక కీలక వ్యవహారంలో పురోగతి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక నష్టం సంభవించకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులు పని ప్రదేశంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దు. చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉంటే విభేదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో విజయ పరంపరలు కొనసాగుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదుగుతారు. పదోన్నతులకు అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఈ వారం ఊహించని ధనలాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఒక విహారయాత్రకు అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంగా నడుచుకుంటే మంచిది. ఉద్యోగంలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొంత నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి నడుచుకోవాలి. ప్రేమ వ్యహారాల్లో కలహాలు, అపార్ధాలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులు కృషి పట్టుదల ఉంటే విజయం సాధించగలరు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. పదవీయోగం ఉంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థికంగా, పరిస్థితులు మెరుగుపడతాయి. పొదుపు ప్రణాళికలపై దృష్టి సారిస్తే మంచిది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం నెలకొంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృథా ఖర్చులు తగ్గించుకోండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. అధికార యోగం, ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లండి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది. వృత్తి పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా కలిసివచ్చే సమయం. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితం మాధుర్యంగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. వ్యాపారులకు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు ఒత్తిడి కలిగిస్తాయి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పట్టుదలతో చదివితే విజయాలు సాధించవచ్చు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో శ్రేష్టమైన అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగులు అంకిత భావం చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. స్దాన చలనం ఉండవచ్చు. వ్యాపారులు పట్టుదలతో ఆశించిన లాభాలను అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ప్రయాణాలు అనుకూలం.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధిని చూస్తారు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. వ్యాపారంలో గతంలో ఆగిపోయిన సొమ్ము చేతికి అందుతుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా ఉంటాయి. గత పెట్టుబడుల నుంచి కూడా లాభపడతారు. ఉద్యోగులు నూతన బాధ్యతలను చేపడతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ లో పురోగతి చూస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ ప్రతిభతో, కృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధురస్మృతులు నెమరు వేసుకుంటారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
