దీపారాధ‌న‌కు ఏ నూనె మంచిది..? మ‌ల్లెపూల నూనెతో ఆ దేవుడి అనుగ్ర‌హం పొందొచ్చ‌ట‌..!

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇండ్ల‌లో, ఆలయాల్లో దీపారాధ‌న చేస్తుంటారు. మ‌రి ముఖ్యంగా దేవుడిని ఆరాధించే స‌మ‌యంలో దీపారాధ‌న చేస్తుంటారు. మ‌రి దీపారాధాన‌కు ఏ నూనె వాడితే మంచిది..? ఎలాంటి ప్ర‌తిఫ‌లం పొందొచ్చు..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

  • Publish Date - April 2, 2024 / 07:03 AM IST

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇండ్ల‌లో, ఆలయాల్లో దీపారాధ‌న చేస్తుంటారు. మ‌రి ముఖ్యంగా దేవుడిని ఆరాధించే స‌మ‌యంలో దీపారాధ‌న చేస్తుంటారు. మ‌రి దీపారాధాన‌కు ఏ నూనె వాడితే మంచిది..? ఎలాంటి ప్ర‌తిఫ‌లం పొందొచ్చు..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇండ్ల‌లో, ఆలయాల్లో దీపారాధ‌న చేస్తుంటారు. మ‌రి ముఖ్యంగా దేవుడిని ఆరాధించే స‌మ‌యంలో దీపారాధ‌న చేస్తుంటారు. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే’ అనే శ్లోకాన్ని చదువుతూ ఆశీస్సులు కోరుకుంటారు. ఆ దీపం వెలుగుతుంటే మ‌న‌సులో ఏదో తెలియ‌ని ఆధ్యాత్మిక అనుభూతి క‌లుగుతుంది. మ‌రి దీపారాధాన‌కు ఏ నూనె వాడితే మంచిది..? ఎలాంటి ప్ర‌తిఫ‌లం పొందొచ్చు..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

ఆవు నెయ్యితో

మీరు ఆర్థిక స‌మస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్ల‌యితే.. ఆవు నెయ్యితో దీపారాధ‌న చేయ‌డంతో ఆ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆవు నెయ్యితో దీపారాధ‌న వ‌ల్ల ఇంట్లోని కుటుంబ స‌భ్యులు ఆరోగ్యంగా, ప్ర‌శాంతంగా ఉంటారు. ఆవు నెయ్యితో అన్ని దేవతలకూ దీపారాధన చేయవచ్చు. ఈ నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట. అలాగే గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని తెలియజేస్తున్నారు. దీపం నుంచి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుందట.

నువ్వుల నూనెతో

నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయట. అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే చాలా మంది ఆవాలు లేదా నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారని పండితులు తెలియజేస్తున్నారు.

పంచదీప నూనెతో

ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి, శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మనలోని చెడు ఆలోచనలు దూరమవుతాయట. అలాగే అనారోగ్యం, పేదరికాలను మన దరి చేరనివ్వదని అంటున్నారు. పంచదీప నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు.

మల్లెపూల నూనెతో..

ఇక అంద‌రికీ అభ‌య‌మిచ్చే హ‌నుమంతుడిని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే.. మ‌ల్లెపూల నూనెతో దీపారాధ‌న చేయాలి. ఈ నూనెతో దీపారాధాన చేస్తే త‌ప్ప‌కుండా ఆంజ‌నేయుడి అనుగ్ర‌హాన్ని భ‌క్తులు పొందుతార‌ని పండితులు చెబుతున్నారు.

Latest News