RRB | రైల్వేలో 2570 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..!

RRB | మీరు రైల్వే( Railway )లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా రైల్వేలో ఇంజినీర్‌( Railway Engineer )గా స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా..? అయితే ఈ నోటిఫికేష‌న్ మీ కోస‌మే. 2570 పోస్టుల‌తో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు( RRB ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. మ‌రి అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు తెలుసుకుందాం..

RRB | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో( Railway Zones ) కింది ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ( RRB ) ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 2570

పోస్టులు: జూనియర్‌ ఇంజినీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌
పేస్కేల్‌: లెవల్‌-6 ప్రకారం ప్రారంభ వేతనం నెలకు రూ.35,400/-

అర్హతలు, ఎంపిక విధానం తదితరాలు అక్టోబర్‌ 31న వెబ్‌సైట్‌లో చూడవచ్చు

ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 30
వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు

సికింద్రాబాద్‌, అహ్మదాబాద్‌, అజ్మీర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్‌, జమ్ము అండ్‌ శ్రీనగర్‌, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్‌రాజ్‌, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం