Hyper Aadi | తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు తన ప్రత్యేక కామెడీ స్టైల్‌తో దగ్గరైన హైపర్ ఆది మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది, ఈసారి మాత్రం సీరియస్ అవతారంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది, ఆ షోలో తన టైమింగ్, సెటైర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కోసం మాత్రమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతని క్రేజ్ ఎంతుందో అర్థమవుతుంది. అలాగే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లోనూ తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. టీవీతో పాటు సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు పొందాడు.
వ్యక్తితో వాగ్వాదం..
ఇక ఇటీవలి కాలంలో సినిమాలు, టీవీ షోలతో పాటు బయట జరిగే ఈవెంట్స్‌లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో హైపర్ ఆది స్టేజ్ మీద నుంచి దిగిపోయి ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. కోపంతో ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్స్‌లో ఆసక్తి పెరిగింది. సాధారణంగా చాలా కూల్‌గా ఉండే ఆది ఇలా సీరియస్ అవడం అరుదుగా జరిగే విషయం కావడంతో ఈ వీడియోపై చర్చ మరింత పెరిగింది.
ఎందుకంత కోపం..
ఈ సంఘటన సమయంలో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంగా చూస్తుండగా, పక్కనే పోలీసులు కూడా కనిపించటం గమనార్హం. దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. “అసలు ఏమైంది?”, “ఎందుకు అంత కోపం వచ్చింది?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
నెటిజన్స్ అభిప్రాయం ప్రకారం, సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హైపర్ ఆది ఇంతవరకు వెళ్లాడంటే, ఎదుటి వ్యక్తి అతన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు వాగ్వాదానికి కారణం ఏమిటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై హైపర్ ఆది లేదా ఆయన టీమ్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నిజానిజాలు బయటపడే వరకు ఆసక్తి కొనసాగనుంది.
