Akhanda 2 | స్కోప్ లేద‌ని ఆ పాత్ర‌కి దండ వేశాం.. బాల‌య్య కామెంట్స్ వైర‌ల్

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ఈ భారీ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.అయితే టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఒక డౌటు అందరినీ వెంటాడుతోంది.

మొదటి భాగంలో బాలకృష్ణ భార్యగా ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో నటించగా, ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె ఈ సీక్వెల్‌లో ఉంటారా? ఉండరా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ బాలయ్యను ఇదే ప్రశ్న అడిగారు. దానికి బాలయ్య తన స్టైల్లోనే స్పందిస్తూ..“అఖండ 2లో ప్రగ్యా పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఒక వేళ పెట్టాలా అన్నా… కథకు అడ్డం పడుతోంది ఆ పాత్ర. అందుకే… ఆమె ఫోటోకి దండ వేసాము!” అని నవ్వుతూ జవాబిచ్చారు.బాలయ్య చేసిన ఈ ఫన్నీ కామెంట్‌పై అంద‌రు తెగ న‌వ్వేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ప్రస్తుత ప్రమోషనల్ బజ్ చూస్తుంటే ‘అఖండ 2’ చిత్రం భారీ హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతుందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో ఈ మూవీ పెద్ద తెర‌పై సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా హిట్టైతే మాత్రం బాల‌య్య రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్టే అని చెప్పాలి.

Latest News