Divvela – Duvvada | రేప‌టి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న దువ్వాడ‌-దివ్వెల‌.. హోప్స్ అన్నీ దానిపైనే..!

Divvela - Duvvada | సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ కపుల్స్‌లో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట ఒకటి. రీల్స్, వ్లాగ్స్, లైవ్ వీడియోలతో వైరల్ అయ్యే ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Divvela – Duvvada | సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ కపుల్స్‌లో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట ఒకటి. రీల్స్, వ్లాగ్స్, లైవ్ వీడియోలతో వైరల్ అయ్యే ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు శ్రీనివాస్ చేసిన ప్రమోషన్స్, సపోర్ట్ కూడా విపరీతంగా చర్చనీయాంశం అయ్యాయి. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్

తాజాగా ఈ క్యూట్ జంట మరోసారి చర్చల్లోకి వచ్చింది. ‘ప్రేమంటే’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో వీరిద్దరూ కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రియదర్శి, ఆనంది జంటగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ప్రముఖ యాంకర్ సుమ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

స్క్రీన్‌పై చిన్న క్యామియో

గతంలో ‘వాలంటీర్’ అనే చిన్న సినిమాలో ఈ జంట కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, మీడియం రేంజ్ సినిమాలో కూడా అవకాశం రావడం వీరి ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్‌. ప్రేమంటే అనే చిత్రంలో దువ్వాడ – దివ్వెల మాధురి క్యామియో రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఏ పాత్రలో కనిపిస్తారో మాత్రం రేపటి వరకు రహస్యంగానే ఉంచారు.

సోషల్ మీడియా ఫాలోవర్స్‌లో ఫుల్ జోష్

ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో రేప‌టి సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిన్న అవకాశం కూడా వారికి మరిన్ని సినిమా ఛాన్సులకూ దారి తీస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. సినిమా క్లిక్ అయితే… ఇన్‌ఫ్లుయెన్సర్ నుండి సిల్వర్ స్క్రీన్ రెగ్యులర్స్‌గానూ మారే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన ‘ప్రేమంటే’ చిత్రంకి థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది క్యాప్షన్ కాగా, ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ – మాధురి జంట అతిథి పాత్రలో క‌నిపించ‌నున్నారా? లేదా క్యామియో రోల్సా? అసలు సినిమాలో వాళ్ళిద్దరి పాత్రలు ఎలా ఉంటాయి? తెరపై ఎంతసేపు కనిపిస్తారు? అనే దానిపై నెట్టింట జోరుగా చర్చ‌లు న‌డుస్తున్నాయి.

Latest News