Tollywood Heroes | సాధారణంగా తమ అభిమాన హీరోలు ఏడాదికి కనీసం ఒక సినిమాని అయిన విడుదల చేసి అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ 2025లో కొందరు యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ రూల్‌ను పాటించలేక ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారు. ఈ ఏడాది అసలు ఒక్క సినిమాతో కూడా పలకరించని యంగ్ హీరోలు ఎవరనేది చూస్తే..
నిఖిల్ : నిఖిల్ నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందకు రాలేదు. ఈ ఏడాది ‘స్వయంభు’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా 2026కి వాయిదా పడింది. అలాగే ‘ది ఇండియా హౌస్’ ఇంకా సెట్స్‌పైనే ఉంది.
అడివి శేషు: ‘డెకాయిట్’ , ‘గూడచారి 2’ సినిమాలు వాయిదా పడుతూ రాగా ఇవి 2026లో రిలీజ్ కావడం ఖాయం.
సాయి ధరమ్ తేజ్ : 2023లో ‘బ్రో’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో పలకరించాడు. కానీ 2025లో ఒక్క సినిమాకు కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. రాబోయే వేసవిలో కొత్త సినిమా రాబోతుంది.
వరుణ్ తేజ్: మట్కా సినిమాతో డిజాస్టర్ అనుభవం తర్వాత కొత్త హారర్ కామెడీ సినిమాతో 2026 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నవీన్ పోలిశెట్టి: ‘మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత ఈ ఏడాది ‘ఒక రాజు’ సినిమాతో రావాల్సి ఉంది, కానీ యాక్సిడెంట్ కారణంగా సినిమా 2026 సంక్రాంతికి వాయిదా వేసారు.
స్టార్ హీరోలు:
చిరంజీవి: ‘విశ్వంభర’ సినిమా ఈ ఏడాదిలో రావలసి ఉండగా, అది 2026 వేసవికి వాయిదా పడింది.‘మన శంకర్ వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతికి వాయిదా పడింది.
ప్రభాస్: ‘కల్కి 2898’ తరువాత కొత్త సినిమా ‘రాజ్ సాబ్’ వీఎఫ్ఎక్స్ ఆలస్యం కారణంగా 2026లో రిలీజ్ కానుంది.
మహేష్ బాబు: గత సంవత్సరం గుంటూరు కారం తర్వాత, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు, 2027లో రిలీజ్ కానుంది.
అల్లూ అర్జున్: ‘పుష్ప2’ తర్వాత అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న బన్నీ ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
మొత్తంగా, ఈ ఏడాది ప్రేక్షకుల కోసం ఒక్క సినిమాతోనైనా ఈ హీరోలు మెరుపులు చూపించకుండా నిరాశపరిచారు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నందున అభిమానులు వచ్చే ఏడాది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
