Vijay -Rashmika | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా పెళ్లి డేట్ ఫిక్స్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

Vijay -Rashmika | ఎట్టకేలకు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్‌లో హీరో–హీరోయిన్ల మధ్య ప్రేమ కథలు కామన్ అయినప్పటికీ, వాటిని నిలబెట్టుకుని పెళ్లివరకు తీసుకెళ్లేవారు మాత్రం అరుదుగా ఉంటారు.

Vijay -Rashmika | ఎట్టకేలకు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్‌లో హీరో–హీరోయిన్ల మధ్య ప్రేమ కథలు కామన్ అయినప్పటికీ, వాటిని నిలబెట్టుకుని పెళ్లివరకు తీసుకెళ్లేవారు మాత్రం అరుదుగా ఉంటారు. ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ ప్రేమను వివాహంతో ముడిపెట్టగా, వచ్చే ఏడాది అత్యంత ఆసక్తికరంగా మారనున్న జంటగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా పేరు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నా, ఈ విషయాన్ని మాత్రం ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు.

కలిసి ట్రిప్స్ వేయడం, ఒకే లొకేషన్లలో కనిపించడం వంటి అంశాలు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. అయినప్పటికీ, తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచాలనే నిర్ణయంతో విజయ్, రష్మిక ఈ విషయంలో మౌనం పాటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో విజయ్ – రష్మిక చాలా సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని టాక్. విజయ్ ఇంట్లోనే కేవలం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ, దాని గురించి ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని సమాచారం.

ఇప్పుడు ఈ జంట పెళ్లి డేట్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా వివాహం ఉదయపూర్‌లో ఘనంగా జరగనుందని ప్రచారం సాగుతోంది. ఇరు కుటుంబాలు కలిసి ఈ డేట్‌ను ఫైనల్ చేశాయని, డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉదయపూర్‌లో ఈ పెళ్లి నిర్వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించనున్నట్లు సమాచారం.

పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో మాత్రం గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని, ఆ వేడుకకు సినీ పరిశ్రమ మొత్తం హాజరవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై విజయ్ గానీ, రష్మిక గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే అని అభిమానులు అంటున్నారు.

Latest News