Cinema | పైరసీ చేసే వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత కళ్యాణ్

పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కు ధన్యవాదాలు తెలిపారు.

విధాత, హైదరాబాద్ :
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ మాట్లాడుతూ… పైరసీ చేస్తున్న వాళ్లను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.
ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

అనంతరం నిర్మాత సీ. కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా పైరసీ చేసే వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. వందల మంది కష్టంతో సినిమా నిర్మితమవుతుందన్నారు. ఛాంబర్ పైరసీ సెల్ పైరసీ ని అరికట్టే విషయంలో ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఇక్కడే కాదు విదేశి సినిమాల విషయంలో కూడా పైరసీని అరికట్టేందుకు ఎన్నో చేసిందని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ దేశానికి చెందిన వాళ్ళు కూడా అభినందించారన్నారు.
ఐ బొమ్మ వెబ్ సైట్ కు చెందిన వాళ్లను పట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ పెట్టిందన్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. పైరసీ ని అరికట్టేందుకు ప్రభుత్వం తో కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ…సినిమా పైరసీ అనేది క్యూబ్, వీఎఫ్స్ లాంటి ప్లాట్ ఫోమ్స్ నుంచి బయటకు వెళ్తుందని.. నిర్మాతలు వాటి మీద కచ్చితంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసామని అని టికెట్ రేటు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. టికెట్ రేటు ఎక్కువ వుండడం వల్ల ప్రేక్షకుడు దొంగ దారిలో సినిమా చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ సినిమా తీయాలి కానీ బడ్జెట్ ఎక్కువ సినిమాలు కాదు దాని వల్ల రెమ్యూనరేషన్ ఒకరికి ఇద్దరికీ మాత్రమే ఎక్కువ ఇస్తున్నారన్నారన్నారు. దాని ప్రభావం వల్ల టికెట్ రేటు ఎక్కువ అవుతుందని స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి 10 లోపు వస్తుంటాయి.. వాటి వల్ల చిన్న సినిమాలు ఎక్కువ నష్టపోతున్నాయని చదలవాడ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News